Saturday, 22 April 2017
Sunday, 9 April 2017
భావసమరం
భావసమరం
మదిని మధురంగా
తడుముతున్న
అనుభవాల అనుభూతులు
తీయగా పలకరిస్తున్న
భావపరిమళాలు
సంధ్యావేళలో ఉషోదయపు
గీతికల్లా...
అనుభవపుష్పాలను
చిదిమేసే
ఆవేశ తరంగాలు
నమ్మకాన్ని వమ్ము చేసే
కరకుదేలిన తూటాలు
భావం మాడి మసైపోతోంది
చితిమంటలలో కాలుతున్న
శవంలా ...
పరస్పర విరుద్ధ భావజాల
సంఘర్షణలో
ఓటమిని ముద్దాడుతూ
భయంతో పారిపోతున్నా
నా మనసును గుప్పిట
పట్టుకుని
అదికూడా
కాలిపోతుందేమోనని...
Wednesday, 5 April 2017
ఓటమి
ఓటమి
రెండు చేతులతో
ముఖారవిందమును
దాచుకున్నావు
నీ అందాన్ని
కానరానీయరాదని
నీకేం తెలుసు
నీ అందం మరింత
రెట్టింపయ్యిందని
నీ కరకంకణములు మంచుకొండల
మెరుపులైతే
కొండల మాటున దాగిన శశి
కిరణాలే నీ కన్నులు
తనివితీరా నీ
నయనసోయగాలను చూస్తూ
ఎన్నెన్నో కవితలు
రాసుకోవాలని అనుకున్నా
నీ సొగసులకు మెరుగులు
దిద్దేలా అక్షరాలను
అల్లుకోవాలని భావాలను
వెతుక్కున్నా
భావాలు ఎన్ని మెదిలినా
నీ అందానికి సరితూగే
అక్షరాలు మాత్రం
దొరకనేలేదు
జఫర్ గజల్ ను తడిమి
చూసా
కృష్ణ శాస్త్రి కవితలు
మననం చేసుకున్నా
గులాం అలీ
మంద్రభావాలను పరికించి చూసా
చివరకు పంకజ్ ఉధాస్
గానాన్ని గుర్తుచేసుకున్నా
ఎక్కడా భావాలు
దొరకలేదు
అక్షరాలు కుదరలేదు
అప్పుడు తెలిసింది నాకు
నీ కనురెప్పలసొగసుల
వెలుగులముందు
సమస్త భావలోకం
ఓడిపోయిందని
మనస్వినీ
Subscribe to:
Posts (Atom)