Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 9 April 2017

భావసమరం

భావసమరం

మదిని మధురంగా తడుముతున్న
అనుభవాల అనుభూతులు
తీయగా పలకరిస్తున్న
భావపరిమళాలు
సంధ్యావేళలో ఉషోదయపు గీతికల్లా...
అనుభవపుష్పాలను చిదిమేసే
ఆవేశ తరంగాలు
నమ్మకాన్ని వమ్ము చేసే
కరకుదేలిన తూటాలు
భావం మాడి మసైపోతోంది
చితిమంటలలో కాలుతున్న శవంలా ...
పరస్పర విరుద్ధ భావజాల సంఘర్షణలో
ఓటమిని ముద్దాడుతూ
భయంతో పారిపోతున్నా
నా మనసును గుప్పిట పట్టుకుని
అదికూడా కాలిపోతుందేమోనని... 

No comments:

Post a Comment