ఓటమి
రెండు చేతులతో
ముఖారవిందమును
దాచుకున్నావు
నీ అందాన్ని
కానరానీయరాదని
నీకేం తెలుసు
నీ అందం మరింత
రెట్టింపయ్యిందని
నీ కరకంకణములు మంచుకొండల
మెరుపులైతే
కొండల మాటున దాగిన శశి
కిరణాలే నీ కన్నులు
తనివితీరా నీ
నయనసోయగాలను చూస్తూ
ఎన్నెన్నో కవితలు
రాసుకోవాలని అనుకున్నా
నీ సొగసులకు మెరుగులు
దిద్దేలా అక్షరాలను
అల్లుకోవాలని భావాలను
వెతుక్కున్నా
భావాలు ఎన్ని మెదిలినా
నీ అందానికి సరితూగే
అక్షరాలు మాత్రం
దొరకనేలేదు
జఫర్ గజల్ ను తడిమి
చూసా
కృష్ణ శాస్త్రి కవితలు
మననం చేసుకున్నా
గులాం అలీ
మంద్రభావాలను పరికించి చూసా
చివరకు పంకజ్ ఉధాస్
గానాన్ని గుర్తుచేసుకున్నా
ఎక్కడా భావాలు
దొరకలేదు
అక్షరాలు కుదరలేదు
అప్పుడు తెలిసింది నాకు
నీ కనురెప్పలసొగసుల
వెలుగులముందు
సమస్త భావలోకం
ఓడిపోయిందని
మనస్వినీ
No comments:
Post a Comment