భావమాలికల సింగారం
ప్రభవించిన నా
స్వప్నాలను
నీ కురులలో పువ్వులుగా
అల్లుకున్నాను
నవ్వుతున్న పువ్వులలో
నా కవితలను
దాచుకున్నాను
రాలిపడుతున్న కవితా
పుష్పాలను
నా గుండెలో అదుముకున్నాను
కవితలు నిండిన నా
మనసును
నీ నుదుటిపై చుక్కలా
దిద్దుకున్నాను
విరిసిన నీ పెదాలపై
నా భావాలను
అద్దుకున్నాను
జారిపడుతున్న నవ్వులలో
నా కలలను ఏరుకున్నాను
నీ కనుల జారే
వెన్నెలలో
తారకలను దాచి పెట్టాను
ఒకటేమిటి
నీ నఖశిఖ పర్యంతం
నా భావమాలికలతో సింగారించుకున్నాను
మనస్వినీ
No comments:
Post a Comment