నవస్వప్నం
ప్రభాత సుందర వేళ
నిశిదుప్పటి జారిపడిన
వేళ
తొలికిరణాల వెచ్చని
పలకరింపు సాక్షిగా
జనియిస్తున్నా ప్రతి
ఉదయం
అందమైన స్వప్నంలా
వేకువను వెన్నెల కమ్ముకుంటే
నింగి తారకలను మనసులో
దాచుకుంటూ
కనులుమూస్తున్నా
అనివార్యమైన మరణంలా
జననం నుంచి మరణంలోకి
మరణం నుంచి జననంలోకి
ప్రతిరోజూ
జారిపోతున్నా
ఉషస్సును పలకరించే
సంధ్యలా
జననమో మరణమో తెలియని
వేళల్లో
ప్రతి ఉదయం కొత్త
ఊపిర్లు నింపుకుంటున్నా
ప్రాణం పోసుకున్న
నవస్వప్నంలా
No comments:
Post a Comment