Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 24 February 2018

నా చరిత నువ్వే

నా చరిత నువ్వే 

నీ మెడవంపున జారుతున్న
స్వేదబిందువులను
అమృత ధారలని తలచి
దాహార్తి తీర్చుకోనా...
ఎదపొంగుల ఆవిర్లను
ఊపిర్లుగా మలుచుకుని
జీవం పోసుకోనా...
సొగసు పూలను
అక్షరాలుగా చేసి
కవితలుగా అల్లుకోనా...
ఇంతకన్నా ఏం కావాలి నాకు
నీతో సాగిన పయనమే
నా చరిత్రయని రాసుకోనా...

1 comment:

  1. అందమైన కవితలు ఎన్నో రాసేస్తూ అల్లుకోనా అని ప్రశ్నించనేల? :)

    ReplyDelete