Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday, 13 July 2018

కరిగిపోయా కలిసిపోయా

కరిగిపోయా కలిసిపోయా

నా గురించి రాసుకునేందుకు ఏముందని
నా గురించి చెప్పుకునేందుకు
ఏం మిగిలిందని
నాలో నేనున్నానా అసలు
నా అక్షరాలు నా మాట వినక
తన వెంటే పరుగులు తీస్తాయి
ఆ మెడలో మాలై హత్తుకుందామని
నన్ను నేను వెతికితే
నేనేక్కడున్నా
అందమైన ముఖారవిందం నుదుటన బిందియానై సేద తీరుతున్నా
ఆ నవ్వుల గలగలలో నోటి ముత్యమై రాలిపడుతున్నా
ఆ కన్నుల వెన్నెలలో
నల్లని కాటుకనై కరిగిపోతున్నా
ఆ పద లయమంజీరాలలో
తీయని సవ్వడిలా వినిపిస్తున్నా
ఎక్కడని వెతకను నన్ను నేను
 
తన వలపు తలపుల తపనలో
ఎప్పుడో లీనమయ్యా....

2 comments:

  1. ఏమీ లేదంటూనే అంతటా లీనమయ్యారెంటండి..

    ReplyDelete
  2. మీ గురించి వ్రాసుకోవాలా...పువ్వు పరిమళించక మానదుగా.

    ReplyDelete