నవ చరిత్ర
ప్రకృతి కాన్వాసుపై
ఒకరినొకరం అద్దుకుంటూ
జలాశయం పరవళ్ళలో
మనసు భాషను వింటూ
పచ్చ పచ్చని సొబగుల్లో
మన సొగసులను జారవిడుస్తూ
కరిగిపోయిన కలతల
ఆనవాళ్ళను జలార్పణం చేస్తూ
ఒకరికొకరం సాంత్వన అందిస్తూ
కాసిన్ని ఘడియలు సర్వం
మరిచిపోతూ
బతుకు పుస్తకంలో
కొత్త అక్షరాలను రాసుకుంటున్న
వేళ
ప్రకృతి సైతం నవ చరిత్రకు
శ్రీకారం చుట్టదా
మనస్వినీ...
No comments:
Post a Comment