ఏం చేయను...
మనసులో మండుతున్న మంటలను
అక్షరాలుగా సంధించాలని అనుకుంటాను గానీ
శిథిల హృదయంలో ఏ మూలనో
మిగిలి ఉన్న అనురాగం అంటుకుని
ఆ అక్షరాలు పుష్పాలై పరిమళిస్తున్నాయి
ఏం చేయను...
మనసును ముక్కలు చేసిన మనసుపై
సమరం చేయానుకుంటాను గానీ
చెల్లాచెదురైన మనసు ముక్కలు
మూకుమ్మడిగా
ఆ మనసునే ఆరాధిస్తున్నాయి
ఏం చేయను....
No comments:
Post a Comment