నవ్వుతుంది నవ్విస్తుంది
కనురెప్పల మాటున
దాచుకున్న నీటిపొరలను ఇట్టే
పట్టేస్తుంది...
క్షణం క్షణం నా మనసును
స్కానింగ్
చేసేస్తుంది...
నా అంతరంగాన్ని క్షుణ్ణంగా
చదివేస్తుంది...
నేను ముభావంగా కూర్చుని
ఉంటే
ఒక అలలా చుట్టముట్టేస్తుంది...
క్యా హోరా గౌస్ భాయ్ షేక్
అంటూ నా ఆలోచనలకు బ్రేక్ వేసేస్తుంది...
నవ్వుతుంది
నవ్విస్తుంది.
నానా అల్లరి చేస్తుంది
అమ్మలా లాలిస్తుంది
కొండంత భరోసా ఇస్తుంది...
అవును
నా చిట్టితల్లి
నాకు ఒక ధైర్యమై నిలుస్తోంది...
No comments:
Post a Comment