చుక్కేసి పడుకో మనసా
నిగ్గదీసి అడిగి నిలదీయాలని
ఉంది...
అబద్ధాలను నిప్పుతో కడిగేయాలని
ఉంది...
నివురులో సమాధి అయిన నిజాలను
నిప్పులా మండించాలని ఉంది...
మాటల మతలబుల చిక్కుముడి
విప్పేయాలని ఉంది...
చిరునవ్వుల మాటున దాగిన
విషపుష్పాలను నలిపేయాలని ఉంది...
గడిచిన కాలం చేసిన గాయాలను
వెలికి తీయాలని ఉంది...
పువ్వులా పరిమళించే నా
అక్షరాలను అగ్ని శిఖలుగా సంధించాలని ఉంది...
శాంతి మంత్రం పఠించు
గౌస్ భాయ్
మందేసిన వేళలో అక్షరాలను
నిద్రపుచ్చడమే మేలు...
చుక్కేసి కైపెక్కి
ముసుగేసి పడుకో మనసా...
No comments:
Post a Comment