మెల్లమెల్లగా కరిగిపో...
అసహనమై నువ్వు అటూ ఇటూ
కదులుతున్నావేమో
హృదయసీమలో ప్రకంపనలు నమోదవుతున్నాయి..
నా హృదయం నీకు బందీఖానా
కాదు
అది నీ అందమైన ఆషియానా...
గుండె గోడలను చీల్చకు
హృదయ మైదానం ధ్వంసం చేయకు..
కాస్త పదిలం ప్రియతమా
నా హృదయం సున్నితం
సడీ చప్పుడు చేయకుండా
మెల్లమెల్లగా కరిగిపో...
నువ్వు చేసే అలజడికి
ప్రకంపనల తీవ్రత కాసింత
పెరిగినా నేనే లేకుండా పోతాను...
No comments:
Post a Comment