శిఖరంలా నిలిచియున్నా
నరనరానా నయవంచన నింపుకున్న
స్నేహం చేసిన మోసాలను చూస్తున్నా...
తట్టు తగిలి కింద పడితే
పళ్ళికిలించి నవ్విన లోకాన్ని చూస్తున్నా...
చెదలు పట్టిన మనసులో పుట్టిన
వికృత భావాలకు
కుప్పకూలుతున్న
సంస్కారాన్ని చూస్తున్నా...
గెలిచామని భ్రమిస్తూ పాతాళానికి
పడిపోయిన
వాడినీ వీడినీ
నిన్నూ చూస్తున్నా
నేను మాత్రం శిఖరంలా నిలిచియున్నా...
No comments:
Post a Comment