ఎర్రచుక్కల నీడలో
అదిగో ఆ కీకారణ్యంలో
ఏదో పొలికేక వినిపిస్తోంది
చూడు
రాజ్యం ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది ఎందుకో...
తమ ఇజమే శాసనమని పిచ్చిరంగుల
జెండాలు పట్టిన ఆ చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి ఎందుకో...
అదిగో చూడు
జనారణ్యంలో పుస్తకం పట్టిన
ఆ యువహృదయం
చరిత్రను తిరగదోడుతోంది
పక్కదారి పట్టిన నేటి చరిత్ర
అక్షరాలు జారిపడుతున్నాయి ఎందుకో...
అదిగదిగో చూడు పల్లెసీమల్లో
పడుచుపాటలు ఇంకా తూటాలు
పేలుస్తూనే ఉన్నాయి
కరుడుగట్టిన ఆ గుండెల్లో
ప్రకంపనలు ఎందుకో...
ప్రపంచమా తెలుసుకో
నువ్వెన్ని ఇజాలు రుచి
చూసినా
ఎన్ని జెండాలు మోసినా
కమ్యూనిజం చచ్చిపోదు
ఎర్రజెండా అంతరించదు
పుడమిని చీల్చుకుని ఊపిరిపీల్చే
మొలకలా
అరుణపతాకం
మళ్ళీ మళ్ళీ ఎగురుతూనే
ఉంటుంది
ఎర్ర చుక్కల నీడలో...
No comments:
Post a Comment