భ్రమరాన్ని కాను
భ్రమరాన్ని కాను
విరిసిన ప్రతి పువ్వునూ
కొరుకోను...
పోకిరి మేఘాన్ని కానే కాను
ఎక్కడ పడితే అక్కడ కురిసిపోను...
నన్ను నమ్మి నన్ను మెచ్చినది
కాగితం పువ్వైనా
పరిమళాలు అద్దకుండా ఉండలేను...
ఆర్తిగా చేతులు చాచి ఆప్యాయ్యంగా
చూసిన పుడమిపై
చినుకులా రాలకుండా ఉండలేను...
No comments:
Post a Comment