దేవుడు బాబాయ్
నీకూ నాకూ ఉన్న సాన్నిహిత్యం
నీకూ నాకే తెలుసు
ప్రతిక్షణం నేను నీగురించే ఆలోచిస్తా
నీగురించే మాట్లాడుతా
కోపం వస్తే తిడతా
నీ మీదే అలుగుతా
అన్నింటికీ నిన్నే నిందిస్తా
నిన్ను నమ్మి
నీ బాటనే నడిచి
అన్నీ కోల్పోయానని
నిన్నే ఆడిపోసుకుంటా
మరి నిజమేగా
నన్నెందుకు ఇలా చేసావ్
నా వైభవాన్ని ఎందుకు నేల పాల్జేసావ్
నా మనసు నీకు తెలియనిదా
నా ఆలోచన నీవు గ్రహించనిదా
లోకంలో ఎవరికీ అర్థం కాని నా అంతరంగం
నీకు ఖచ్చితంగా తెలుసు కదా
మరి ఈ పిచ్చి మనుషులకు
ఎందుకు అర్థం కాకుండా చేశావ్
నా అభిమతం ఎందుకు అయోమయం
నా ఆలోచనం ఎందుకు అనుమానాస్పదం
నా మాటలకు అర్థాలు ఎందుకు
మారుతున్నాయ్
నా చేతల్లో లోపాలు ఎందుకు
కనిపిస్తున్నాయ్
ఎందుకు కూరలో కరివేపాకులా మారిపోయా
నిజం చెప్పు నేనేం పాపం చేశాను
ఎవరి కొంపలు ముంచాను
ఎవరి జీవితాలతో ఆడుకున్నాను
నాకు తెలుసు నువ్వేమీ చెప్పవని
చెప్పలేవనీ
అది సరే ఒకటి చెప్పు నాతో ఎందుకు
ఆడుకున్నావ్
జీవితం ఎందుకు నరకం చేశావ్
దేవుడు బాబాయ్
నువ్వు కనబడితే ఇవన్నీ అడగాలని ఉంది
నిన్ను సర్ఫ్ సబ్బుతో ఉతికి ఆరేయాలని
ఉంది
నా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని
ఉంది
విసిగిపోయాను బాబాయ్ ఈ మనుషులతో
ఇక నా వల్ల కాదు బాబాయ్
నువ్వు సృష్టించిన ఈ మనుషులపై నమ్మకం
పోయింది
మిగిలింది నువ్వే
నువ్వు తప్ప మార్గం లేదు
కనిపించే మనుషులకంటే
కనిపించని నువ్వే ఇప్పుడు దిక్కు
దేవుడు బాబాయ్
ఇక అంతా నీ ఇష్టం
ReplyDeleteదే, (నీ) ముడి,
బా, బాయ్ :)
జిలేబి