యా అల్లా ఈ మనుషులను సంస్కరించు
నీ
దివ్య గృహమున శిరస్సు వంచి
ప్రణమిల్లుతున్నా
యా అల్లా సంస్కరించు ఈ మనుషుల్ని
మానవతను వీడి దానవత నీడన చేరిన
మనుషుల్ని సంస్కరించు
మోసము కుట్రల అక్రమ కలయికలో జనియించిన
అష్టావక్ర జీవులనూ సంస్కరించు
తోటివాడిని మనిషిగా కాకుండా
మనీతో చూసే మనిషిని సంస్కరించు
బంధాలు అనుబంధాలను అపహాస్యం చేసే
రాబందులను సంస్కరించు
కుటుంబ భారాన్ని మోస్తూ కొవ్వొత్తిలా
కరిగే
తండ్రిని గౌరవించని తనయులనూ
సంస్కరించు
కట్టుకున్నవాడిని చాకిరి గాడిదలా చూసే
ఇల్లాళ్ళను సంస్కరించు
మాతృమూర్తి మనసును తెలియక
గుండెకు గాయం చేసే పసిబిడ్డలనూ
సంస్కరించు
మానవ సంబంధాలను వ్యాపార బంధాలుగా
మార్చిన
దగాకోరు మనుషులనూ సంస్కరించు
అబద్దాలే పునాదులుగా
కుట్రలే ఆశయాలుగా
ఊపిర్లు పోసుకునే సైతాను బిడ్డలనూ
సంస్కరించు
కుల మతాల పేరుతో
మనుషులను విడదీసే
భూలోక దేవుళ్ళనూ సంస్కరించు
సంస్కరించే వీలు లేకపోతే
సైతానులను సంహరించి
మనిషిని మనిషిగా బతికే వీలు కల్పించు
యా అల్లా ఈ మానవాళిని సంస్కరించు
No comments:
Post a Comment