విటమిన్ ఎమ్ ఎంతో
ప్రమాదకరం
అయినా మనిషికి అది
ఎంతో అవసరం
విటమిన్ ఎమ్ లోపిస్తే
మనిషి మనుగడే కష్టం
అది పుష్టిగా ఉంటే
మనిషికి అన్నింటా విజయం
ఇది ఎంత పెరిగినా
లాభమే
తరిగితే మాత్రం జీవితం
దుర్లభమే
సృష్టిలో ఏ జీవికీ
పనికిరానిది
మనిషికి మాత్రం
అమూల్యమైనది
షుగర్ లెవెల్ పడిపోనీ
బిపి పూర్తిగా డౌన్
కానీ
విటమిన్ ఎమ్ ఉంటే
అన్నీ సమతుల్యమే
విటమిన్ ఎమ్ లోపిస్తే
అది పూర్తిగా
అడుగంటిపోతే
వైభవమై నిలిచిన మనిషి
అపహాస్యానికి చిరునామే
మనసులో మోసమే
కనిపిస్తుంది
మాటల్లో ద్రోహమే
కనిపిస్తుంది
మమతలు గాలిలో
కలిసిపోతాయి
బంధాలు ప్రశ్నగా
నిలుస్తాయి
ఆదరించిన మనసులే
నువ్వెంత అని నిలదీస్తాయి
వెన్నుతట్టిన మనుషులే
గడ్డిపోచలా చూస్తారు
మానవతావాదివే నువ్వైనా
నీ మతాన్ని
ప్రశ్నిస్తారు
నీ కులాన్ని లెక్కలోకి
తీసుకుంటారు
నీ మతం ఒక మోసమనీ
నీ కులమొక ద్రోహమనీ
మనసుకు తూట్లు
పొడుస్తారు
విటమిన్ ఎమ్ లోపిస్తే
నీ దేహం కృశించి
పోతుంది
నీ మొహం వెలుగు
కోల్పోతుంది
పెదాలపై నవ్వులు మాయమై
అసహనం రాజ్యమేలుతుంది
విటమిన్ ఎమ్ పుష్కలంగా
ఉంటే
లోకం వంగి వంగి సలాము
చేస్తుంది
నీ మతమే నా మతమని
అంటుంది
నీ కులమూ నా కులమే
నంటుంది
మాట్లాడే మాటల్లో అభిమానమే
కనిపిస్తుంది
చేసే చేతల్లో న్యాయమే
దొరలుతుంది
తప్పు చేసినా
ఒప్పుగానే స్వీకరిస్తుంది
నీఛ తంత్రాలు నడిపినా మనసున్న
మారాజని అంటుంది
విటమిన్ లోపిస్తే
బతికినా అది మరణమే
విటమిన్ పుష్కలంగా
ఉంటే మరణించినా వైభోగమే
ఓ మనిషీ
విటమిన్ ఎమ్ తో జర జాగర్త
Good one
ReplyDelete