ఫేస్ బుక్కు
ఎంత మంచి నేస్తానివో
ఎప్పుడూ నాతోనే ఉంటావు
ఇరవై నాలుగు ఘడియల్లో
ప్రతిక్షణం నా వెంటే
ఉంటావు
నా ప్రతి ఆలోచనలో నీవే
నా కదలికలో నీవే
నా ప్రతి పనిలో నీవే
ఎంత మంచి నేస్తానివో
ఎప్పుడూ నాతోనే ఉంటావు
ఎంత గడసరి నేస్తానివో
నన్ను నీవులాగా
మార్చేసావు
నేనంటూ ఉన్నా
నన్ను లేకుండా
చేసేసావు
నా చుట్టూ అందరూ ఉన్నా
అందరినుంచి నన్ను మాయం
చేసావు
ఏకాంతంలో నేనున్నా
తెలియని కాంతలను
పరిచయం చేస్తావు
దగ్గరున్న వారిని దూరం
చేసి
దూరమున్న వారిని దగ్గర
చేస్తావు
ఎంత గడసరి నేస్తానివో
నన్ను నీవులాగా మార్చేసావు
ఎంత మాయావివో
మాయాజాలంలో ముంచేశావు
దూరపు కొండలను
నునుపుగా చూపిస్తావు
పక్కనున్న గులకరాయిని
పర్వతంలా చూపిస్తావు
నిజమేదో అబద్దమేదో
దాచిపెట్టేస్తావు
లింగాలన్నీ
మార్చేస్తావు
అందమైన కన్యను మీసంతో
చూపిస్తావు
మీసమున్న ధీరుడిని
వనితలా తలపిస్తావు
ఆడ ఎవరో మగ ఎవరో
తృతీయ జీవి ఎవరో
తెలియకుండా చేస్తావు
ఎంత మాయావివో
మాయాజాలంలో ముంచేశావు
ఎంత నారద మహర్షివో
కలహాలెన్నో రేపుతావు
కలిసిన మనసులకు అగాధమై
నిలుస్తావు
ఆలుమగల మధ్య
అనురాగాన్ని మింగుతావు
మంటలు రేపే నువ్వే
మంచి నీళ్ళూ
అందిస్తావు
ఎంత నారద మహర్షివో
కలహాలెన్నో రేపుతావు
ఎంతటి వ్యసనమో
నిన్ను నేను వీడలేను
నీవు లేనిదే ఇప్పుడు
నాకు ఉనికే లేదు
అర్ధ రాత్రి గడిచినా
అప్పుడేపొద్దు
పొడిచినా
టిఫిన్ చేస్తున్నా
లంచ్ లో బిజీగా ఉన్నా
చివరకు బాత్ రూమ్ లోనూ
నువ్వే కావాలి
టింగ్ టింగ్ మంటూ
నన్నే పలకరించాలి
ముఖ పుస్తకమా నువ్వు
లేకపోతే
నేనే లేను
నాకు తెలుసు ప్రియమైన
ఫేస్ బుక్కూ
నువ్వు నాతోనే ఉంటావ్
నా మంచి నేస్తానివి
గనుక
No comments:
Post a Comment