షరాబీ
అప్పుడే చిగురించిన చందమామను
చూసి
మబ్బులతో పయ్యెదలను
సవరించుకున్న ఆకాశంలా
మధుకలశాలుగా కైపును నింపుకున్న
కన్నులపై
మత్తుగా వాలుతున్న రెప్పల్లా
లయతప్పిన శ్వాసలో వణికే
తీయని అధరాల్లా
మృదు మంజీర సవ్వడిలో తడబడుతున్న
పాదపద్మాల్లా
తనువంతా తమకంతో
ఒళ్ళు విరుచుకున్న రతీదేవిలా
నా అక్షరం గతి తప్పుతున్నది
ఎందుకో
మధుశాలలో షరాబిలా..
No comments:
Post a Comment