ఆడవే నయం
ఆటవిక జాతుల సంచారం
ఆదిమానవుల ఆచారం
ఇదే నేటి జనారణ్య గ్రహచారం
తమ సమూహమే గొప్పదంటూ
మరో సమూహాన్ని సంహరిస్తూ
తన వైభవానికి
మరొకడి జీవితాన్ని పునాదిగా
మారుస్తూ
ఆటలాడుకుంటున్న ఆటవికుల
ఆధునిక నగరం కంటే
అడవిజంతువులు సంచరించే
కీకారణ్యమే ఎంతో కొంత నయం కదా...
No comments:
Post a Comment