పాదాభివందనం
నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నామని
అనుకుంటారు
అలా చూసుకునే క్రమంలో
నన్ను భరించడం అలవాటు చేసుకుంటున్నారని
తెలుసుకోరు
నన్ను ఆకాశానికి ఎత్తుతున్నామని
అనుకుంటారు
నా మనసు మాత్రం వారి పాదాలను
ముద్దాడుతోందని గుర్తించరు
నన్ను ప్రేమించే మనసుకు
నిత్యం నా పాదాభివందనం
🙏
No comments:
Post a Comment