జర జాగ్రత్త
ఎవరు చెప్పారు ఇది అందమైన
లోకమని
నవవసంతాల నిలయమని...
ఎవరు చెప్పారు ఇది
సువిశాల భవన సముదాయ నగరమని...
అందం ఎప్పుడో వికారమైపోయింది
పూదోటల పరిమళాలు లేనే లేవు
కాగితం పూలపై అద్దిన అత్తరువాసనే
గుభాళిస్తోంది...
విశాలమేదీ లేనేలేదు
ఇరుకు మనసున్న మనుషుల సంచారంతో
నగరీకరణ ఇరుకుగా మారిపోయింది...
ఇక్కడ అడుగు తీసి అడుగేయాలంటే
జాగ్రత్త సుమా
జీవమున్న మృతకళేబరాలు ప్రతి
మలుపులో ఎదురు చూస్తూనే ఉంటాయి...
జర సమల్కే చలో భాయ్
యే దునియా బడీ బే రెహమ్
హై...
No comments:
Post a Comment