తలరాత
( ఇది చదవకండి
)
అవును చదవకండి.. మనోభావాలు
తోలూ తొక్కా దేవుడూ దెయ్యం వంటి ఫీలింగ్స్ తో సొంత వ్యక్తిత్వం లేకుండా పోయినవాళ్లు
దయచేసి ఇది చదవకండి. తీవ్ర ప్రస్టేషన్ లో ఉన్నా నోడౌట్ ఫ్రస్టేషన్ లో ఉన్నప్పుడే సూటిగా
మాట్లాడతా ఎవడి మనోభావాలు దేనిలో కలిసిపోయినా నాకు అనవసరం. అవగాహన ఉన్నోళ్లు చర్చించవచ్చు.
మైండ్ తిక్క తిక్కగా ఉంటోంది తలరాత అన్న మాట వింటుంటే.. ఎవరిని కదిపినా ఎవరితో మాట్లాడినా
ఏం చేస్తాం మన తలరాత అని నిట్టూర్చడం పరిపాటి. ఇందాక tv లో ఒక సీరియల్ కు సంబంధించిన
యాడ్ లోనూ తలరాత అనే మాట వినిపించింది. పిచ్చి కోపం వచ్చింది ఆ మాట చెవిలో పడగానే..
అసలు ఈ తలరాత అంటే ఏంటి..? అందరూ తలరాత మీద భారం ఎందుకు వేస్తున్నారు.. మన మత సాంప్రదాయాల
ప్రకారం విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.. తకదీర్ మే జో లిఖా హై వహీ హోగా అని అంటారు..
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. మరి ఇలాంటప్పుడు చీమ తప్పేముంది అంతా
దైవ లీల అని సరిపెట్టుకోవచ్చుగా.. జీవితంలో మనం మంచి కొంతే చేస్తాం. ప్రతి నిమిషం ఏదో
ఒక చెడు చేస్తూనే ఉంటాం. అలాంటప్పుడు అక్కడ మన తప్పేముంది? మన నుదుటి రాత అమలవుతోంది
అని అనుకోవచ్చుగా.. ఉదాహరణకు ఒక హత్య జరుగుతుంది. హంతకుడు దేవుడి ఆజ్ఞను నెరవేర్చాడని
సన్మానాలు ఎందుకు చేయం.. చచ్చినోడు వాడి రాత ప్రకారమే పోయాడని అనుకోకుండా చంపినోడికి
శిక్షలు ఎందుకు? ఒక అమ్మాయి పెళ్ళి కాగానే విధవగా మారిపోతుంది. విధిరాత ప్రకారం ఆ మొగుడుపోతే
అదే విధిరాతను నుదుటన మోస్తూ దేవుడి ఆజ్ఞను భరిస్తున్న ఆ అమ్మాయి నష్ట జాతకురాలు ఎలా
అవుతుంది.. దేవుడి ఆజ్ఞకు ప్రతినిధిగా ఉన్న ఆమెను పూజించాలి గాని నష్ట జాతకురాలంటూ
దూరం పెట్టడం ఎందుకు. ఇది విధిరాతను ధిక్కరించటం కాదా ఇది దైవ నింద కాదా? నేను మంచోడినో
చెడ్డోడినో నాకు తెలుసు. కొంతమందికి నా పనులు చెడ్డగా అనిపించవచ్చు. ద్రోహిగానో పాపిగానో
మోసగాడిగానో కొందరికి అనిపించవచ్చు. అరే బై దీంట్లో నా తప్పేముంది తలరాత ప్రకారమే నేను
చేస్తున్నా అనుకుని నన్ను గౌరవించవచ్చు కదా. మోసం ద్రోహం కుట్ర హత్య ఇలాంటి ఘోరాలు
విధిరాత ప్రకారమే జరుగుతున్నప్పుడు దేవుడి ఆదేశాలను గుర్తించకుండా మంచోళ్ళు చెడ్డోళ్లు
అంటూ భేదభావాలేందుకు? దేవుడు రాసిందే అమలవుతుంది ఏది జరిగినా దేవుడి ఆదేశమే అనేది నిజమే
అయితే మరి పాపాలు చేయమని రాయడం ఎందుకు మళ్ళీ శిక్షలు ఎందుకు? ఇదంత దైవ లీల మంచి చెడు
గుర్తించే మెదడు మనిషికి ఇచ్చాడు దేవుడు అని వాదిస్తారు కొందరు. అంటే దేవుడు ఏం రాశాడో
పట్టించుకోకుండా మనిషి సొంతంగా ఆలోచించి చేయాలన్నమాట. అయితే ఇక్కడ తలరాత ఏమయినట్లు?
నిజానికి తలరాత దేవుడేమీ
రాయడు. మన తలరాత మనమే రాసుకుంటున్నాం. ఎదుటివాడి తలరాతను మనమే మార్చేస్తున్నాం. ఒక
మంచోడు కనిపించగానే నేను దొంగ దొంగ అని అరుస్తాను, నా చుట్టూ ఉన్న పదిమందిలో ఐదుగురు
అది నమ్మినా ఆ మంచోడి తలరాతను నేను మార్చేసినట్టే. అలాగే నా రాతనూ మరొకరు మార్చేసేయొచ్చు.
ఇక్కడ బలవంతుడు బలహీనుడి తలరాత మారుస్తాడు. ఒక్కోసారి బలహీనుడు దొరికిన అవకాశాన్ని
సద్వినియోగం చేసుకుని బలవంతుడి తలరాతనూ మార్చిపడేస్తాడు. కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు
ఎవరి తలరాతనైనా మార్చేస్తారు. అయితే అందరి తలరాతను మార్చగలిగే ఏకైక శక్తి డబ్బు మాత్రమే.
ఇక్కడ మంచి చెడూ ఏదీ లేదు మారుతున్న తలరాతల్లో మంచోడు చెడ్డోడు కావచ్చు చెడ్డోడు మంచోడు
కావచ్చు. మనం అన్నీ చేస్తూ విధి మీద నిందలేస్తాం. ఈ ప్రపంచంలో ఒకడి తలరాతను మరొకడు
రాస్తూ బిజీగా ఉన్నంతకాలం ఉన్నాడో లేడో తెలియని
దేవుడి రాతలు నిందలు మోయాల్సిందే....
No comments:
Post a Comment