ఆ మాస్కులు కొనండి..
ఉదయం ఆరున్నర గంటల సమయం..
అత్తాపూర్ డిమార్ట్ పక్కనే ఉన్న ఫ్రెష్ మీట్ షాప్ కు వెళ్ళా.. నిజంగానే అది ప్రెష్
గా ఉంటుంది. జనాల రద్దీ కూడా ఉండదు. రెండు కిలోల మరల్ చేపలు కొన్నా.. కటింగ్ కు ఇంకా
టైం పడుతుందని బయటకు వచ్చి సిగరెట్ వెలిగించా..ఎదురుగా ఇద్దరు కుర్రాళ్ళు పదేళ్ల వయస్సు
ఉంటదేమో డిమార్ట్ కు వచ్చిపోయే వాళ్లకు మాస్కులు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లెంత
బతిమాలుకున్నా ఎవరూ కొనటం లేదు. బ్రాండెడ్ మాస్కులు కావు గనుక వారిని ఎవరూ పట్టించుకోవటం
లేదు. ఇది సహజమే.. నేను వారినే చూస్తున్నా.. ఒక్క మాస్కు కొనండి ప్లీస్ అని దాదాపు
యాచిస్తున్నట్టే అడుగుతున్నారు.జాలేసింది వాళ్ళను చూస్తుంటే... ఇంతలోనే ఓ కారు దూసుకువచ్చింది..
ఆ పిల్లలు ఆశగా ఆ కారువైపు పరుగులు తీశారు.. కారు డోర్ తీసి ఓ మహిళ దిగింది...సుమారు
నలభై ఏళ్ళు ఉంటాయి ఆమెకి.. లావుగా గున్నేనుగులా ఉంటుంది.. నల్లని రంగు.. ఫుల్లు మేకప్..
పెదాలకు ఎర్రటి లిప్స్టిక్ పూసుకుంది. అప్పుడే రక్తం తాగివచ్చిన పిషాచిలా ఉంది.. వాస్తవానికి
ఆమె మాస్కు పెట్టుకునే ఉంది.. కారు దిగగానే తీసేసింది ఎందుకో.. బహుషా ఆమె ముఖారవిందం
అందరికీ కనపడాలనేమో మాస్కు చేతిలో పట్టుకుంది. ఇక అసలు విషయానికి వద్దాం.. ఆ పిల్లలు
ఇద్దరు ఆమెకు దగ్గరగా వెళ్లి మేడం మాస్క్ అంటూ బతిమాలాటం మొదలెట్టారు.. అంతలోనే అమ్మడికి
కోపం వచ్చింది.. నా కార్ ని టచ్ చేస్తారా.. మీ బోడి మాస్కులు ఎవరిక్కావాలి అని అరుస్తూ
దాదాపు కొట్టినంత పని చేసింది..పిల్లలు ఒక్కసారిగా బెదిరిపోయారు.. నాకు దగ్గరగా ఉన్నారు
కాబట్టి వాళ్ళ కళ్ళలో నీటి సుడులు గమనించాను. నాకు చాలా కోపం వచ్చింది కొంటే కొనాలి
లేదా మూసుకుని పోవాలి.. పిల్లలపై అలా విరుచుకుపడటం దేనికి? ఆ కారును టచ్ చేస్తే నేరమా
ఘోరమా.. పోనీ అది ఖరీదైన పడవ కారా అంటే అదీ కాదు. డొక్కు స్విఫ్ట్ అది.. అంతకే రెచ్చిపోయింది.
ఎంత కోపం వచ్చినా ఏమీ అనలేకపోయా.. ఎందుకంటే అది లేడీ.. ఏమన్నా అంటే నాపై నిందలు వేయొచ్చు..
చూడబోతే దాని వాలకం అలాగే ఉంది. ఆరున్నరకే కిలోల కొద్దీ మేకప్ పూసుకుని రోడ్డు మీదకు
వచ్చిందంటే దాని మెంటాలిటీ తెలిసిపోతూనే ఉంది.చిన్నప్పుడు తెలుగువాచకంలో చదువుకున్న
పూతన బొమ్మలా ఉంది అమ్మడు. ఆ పిల్లలతో మాట్లాడి ధైర్యం చెప్పా.. మీరేం తప్పు చేయటం
లేదు భయపడకండి అని అంటూనే రోజుకి ఎన్ని మాస్కులు అమ్ముతున్నారని అడిగా.. నాలుగు లేదా
ఐదు భయ్యా అని బదులిచ్చారు. దినమంతా ఏండా వానా లెక్క చేయక మాస్కులు అమ్మినా చెరో యాభై
రూపాయలే మిగులుతాయంట. మనసు చివుక్కు మంది. డబ్బులు కావాలా అని అడిగా వద్దు భాయ్ మాస్కులు
కొను అని డైరెక్ట్ గా బదులిచ్చారు. వాళ్లలో ఎక్కడలేని ఆత్మాభిమానం కనిపించింది.. చెరో
వంద రూపాయలిచ్చి ఓ నాలుగు
మాస్కులు తీసుకున్నా..
రెండు వందలు పెద్ద లెక్క
కాదు.. కానీ ఆరెండు వందలు ఒక పేద కుటుంబం ఆకలిని తీరుస్తాయి..ఇంటికి వచ్చి ఆ మాస్కులు
నా వాణీ చేతిలో పెట్టి బాగుంటే వాడుకో లేకపోతే పడేయ్ అని అన్నా.. అవి ఎంతకు కొన్నావు
ఎందుకు కొన్నావు అని అడగకుండా.. వావ్ చాలా బావున్నాయ్ అన్నీ నాకే అంటూ వాటిని వాష్
చేసి హ్యాంగర్ కు తగిలించిన వాణిని చూస్తే మనసుకు ఎంతో తృప్తి కలిగింది..
No comments:
Post a Comment