జేఠాలాల్...
ఇతన్ని చూస్తే అప్రయత్నంగానే
పెదాలపై చిరునవ్వు వికసిస్తుంది. తన నడక, హావభావాలు చూస్తుంటే మనల్ని మనం మరిచిపోవడం
ఖాయం. ముంబయిలోని గోకుల్ ధామ్ సొసైటీ లో ఉంటాడు. అక్కడే అశోక్ నగర్ ఏరియాలో ఎలక్ట్రానిక్
షాప్ నిర్వహిస్తుంటాడు. మనిషి చాలా మంచోడు. కానీ అతని జాతకంలో అన్నీ కష్టాలే. పొద్దున
లేవగానే ఏదో ఒక సమస్యతో కింది ప్లాట్ లో ఉండే తన ఫ్రెండ్ తారక్ మెహతా దగ్గరికి పరుగులు
తీయడం అతనికి అలవాటు. సమస్య మొదలు నుంచి అంతం దాకా రకరకాల ట్విస్టులు, నవ్వులే నవ్వులు...
హిందీ ఎంటర్ టైన్ మెంట్ చానల్స్ చూసే వారికి ఈ జేఠాలాల్ ఎవరో బాగానే తెలుసు. అవును
నేను సోని సబ్ టీవీలో నిరవధికంగా ప్రసారమయ్యే తారక్ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్ గురించి
చెబుతున్నా.. కుటుంబంతో సహా కూర్చుని హాయిగా కామెడీ ఎంజాయ్ చేయవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం
దాకా పాత ఎపిసోడ్స్ అన్నీ ప్రసారమవుతున్నాయి.. గోకుల్ ధామ్ సొసైటీ లో జరిగే ఈ వినోదం
లాక్ డౌన్ సమయంలో రిలీఫ్ ఇవ్వడం ఖాయం. కాకపొతే
హిందీ తెలిసి ఉండాలి. నేను ఈ షో చూస్తున్నంత సేపు నా తొక్కలో జిందగీని పూర్తిగా మరిచిపోతాను.
ఇప్పుడు ఈ షో నాకు మంచి నేస్తమయ్యింది. వీలయితే చూడండి అందరూ మనసు తేలికపడుతుంది.
No comments:
Post a Comment