వామపక్షాలు మనుషులు కారా?
హింస ఎక్కడైనా సమర్ధనీయం
కాదు. కానీ బెంగాల్ హింసకు బిజెపికి బాధ్యత లేదా... టీఎంసీ అధికారంలోకి వచ్చిన తొలిన్నాళ్ళనుంచి
కమ్యూనిస్టులను సమూలంగా నాశనం చేయాలనే కసితో ఆ పార్టీ కార్యకర్తలు వామపక్షాల కార్యకర్తలపై
సాగించిన ఆరాచకాలు, హత్యాకాండ బిజెపికి తెలియదా... కేంద్రంలో అధికారంలో ఉండి కూడా కనీసం
స్పందించలేదే.. ఇప్పుడు గొంతు చించుకుంటున్న గోదీ మీడియా అప్పుడు నోరెందుకు విప్పలేదు..
చూసీ చూడనట్లు వ్యవహరించారు కదా. అప్పుడెందుకు సమీక్షలు జరపలేదు. అప్పుడు చస్తుంది
మీ శత్రు పార్టీ కార్యకర్తలు గనుకనా.. ఇప్పుడు ఒకరిద్దరు బిజెపి కార్యకర్తలు చస్తే
నానా రభస చేస్తున్నవాళ్లు అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు. అంటే వామాపక్షాలు మీ శత్రువులు
గనుక మీ మనసులో ఉన్నదే మమత చేస్తున్నది కాబట్టి అన్నీ మూసుకున్నారా. ఇప్పుడు బిజెపి
కార్యకర్తలపై దాడులు అంటూ కిందా మీదా పడుతున్న గోదీ మీడియా అప్పుడెందుకు మాట్లాడలేదు.
పప్పాకు కోపం వస్తుందన్న భయమా.. ఏం వామపక్ష కార్యకర్తలవి ప్రాణాలు కావా? వారు మనుషులు
కారా? మీ పార్టీ వాళ్లయితేనే మనుషులా? వారివి మాత్రమే ప్రాణాలా?
అప్పుడు ముద్దొచ్చిన మమత
ఇప్పుడు ఎందుకు వెగటుగా మారింది. ఇప్పుడు జరుగుతున్న హింసకు అప్పుడే బిజెపి ఊపిరి పోసిందన్నది
నిజం. ఈ నిజం తెలిసినా ఇప్పుడు బిజెపి దాని అనుకూల మీడియా చేస్తున్నది పచ్చి రాజకీయం.
No comments:
Post a Comment