గొడుగు
నా గొడుగుకి చిల్లులు
పడ్డాయి
అక్కడక్కడా
వానచినుకులు
ఒంటికి తాకుతున్నాయి
సూర్యుని వాడివేడి
కిరణాలు
దేహాన్ని
కాల్చుతున్నాయి
సిద్ధాంతాల వాసన
ముక్కుపుటాలను
తాకుతోంది
బూజుపట్టిన ఆదర్శాలు
మసక బారుస్తున్నాయి
గొడుగువంటి నా మనసును
నేను మార్చుకోను
ఎందుకంటే
ఏ ఎండాకా గొడుగు పట్టే
అలవాటు నాకు లేదు
No comments:
Post a Comment