నాలోనే నీవు
నీవు నడియాడిన నా
లోగిలిలో
నీ మువ్వల సవ్వడియే
వీనులను తాకుతోంది
శృతి చేసిన వీణలా...
నీవు శ్వాసించిన నా
పరిసరాల్లో
నీ పరిమళమే నాసికను
తాకుతోంది
విచ్చుకున్న మల్లె వాసనలా...
నీవు విసిరిన నవ్వుల
పువ్వులలో
నీ అలికిడే
వినిపిస్తోంది
నిశబ్దాన్ని ఛేదించిన మురళీరవంలా...
నీవు తాకిన నా కనురెప్పల్లో
నీ రూపమే కదలాడుతోంది
బాపూ గీసిన బొమ్మలా...
ఎవరు చెప్పారు
నువ్విప్పుడు నాతో
లేవని
నా మనసు చెబుతోంది
నువ్వు నిత్యం నాలోనే
ఉన్నావని
మనస్వినీ ...
మనస్వినీ ...
No comments:
Post a Comment