దేవకన్య
తలవాల్చి
ప్రణమిల్లుతున్నట్లు
తీరానికి చేరి సలాము
చేస్తున్న కడలి కెరటాలు
పాదాలను మృదువుగా
కడుగుతూ ఉంటే
ముద్దాడుతున్న ఇసుక
తిన్నెలలో
అడుగుతీసి అడుగులు
నేను వేస్తూ ఉంటే
నా పాదములు జారవిడిచిన
ముద్రలలో
నీవు అడుగులు వేస్తూ
నా వెంట నడుస్తూ ఉంటే
సప్త పదములు పూర్తి
చేసిన
పెళ్లికూతురువి నీవై
నడియాడగా
ఇసుక రేణువులు నీ పాదాలకు
పారాణిలా
సముద్రుడి ఘోష
వేదమంత్రాలు జపించగా
అలలపై నర్తించే
పిల్లగాలులు
మంగళ వాయిద్యాలు
మోగించగా
పకృతి అందాలు దీవెనలు
అందించగా
ఎంత మధురం ఆ దృశ్యం
ఎంతగా పులకించింది నా
మానసం
ప్రకృతి కాంత ఒడిలో
చిన్నారి దేవకన్యలా
నీవు చిందించిన
నవ్వులు
నీవు రువ్విన పువ్వులు
మరువగలనా ఆ అనుభవం
నిలిచి ఉండదా కలకాలం
మనస్వినీ...
No comments:
Post a Comment