మంచుకొండల్లో మనస్వినీతో
ఎదను తాకిన చల్లని
గాలులు
గుండె గడ్డ కట్టిందేమోనని
కలవరం
బిగుసుకుపోయిన దేహంలో
అదుపుతప్పిన ప్రకంపనలు
విప్పారిన కనులముందు
హిమవన్నగ సోయగాలు
వెండి కొండలపై పాల
నురగలా
తెల్లని పరదాల దుప్పటి
కప్పిన చందంలా
కనురెప్పలకే పరిమితమైన
స్వప్నాలు
కనుల ముందు నిలిచిన
వైభవంలా
అది మాయాలోకపు విహారమా
సృష్టికర్త కుంచె
నుంచి జారిపడిన
మంచుపూల వసంతమా
దేవుడు దివినుంచి
భువికి దింపిన
స్వర్గలోక సౌందర్యమా
దైనందిక జీవన బంధనాలు
విసిరేసి
మంచుపూల మనస్సుతో
పెంగ్విన్ పక్షుల జంటలా
అప్పుడే కురిసిన హిమ
వర్షంలో
మనస్వినీ సహిత విహారం
కిలకిల రావాల సోయగం
వెచ్చని కోర్కెల
సాంగత్యం
మరలా మరలా కోరదా మనసు
ఆ అందమైన అనుభవం
No comments:
Post a Comment