Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 15 August 2018

దేశమా ఎక్కడుంది నీకు స్వాతంత్ర్యం?

దేశమా ఎక్కడుంది నీకు స్వాతంత్ర్యం?

ఎర్రబడిన ఆకాశంలో వేగుచుక్కలు నవ్వాలి
అడవి బిడ్డల గుండెల్లో
బందూకు దాడులు ఆగాలి
ఆదివాసీ పెదిమపై
ఎర్రమల్లెలు పూయాలి
పచ్చని పైరులు విరబూసి
రైతన్న నవ్వాలి
కుసుమపువ్వులు నా ఆడబిడ్డలు
నిర్భయులైబతకాలి
నా వేశం నా భాష
నా సొంతం కావాలి
నచ్చిన తిండి తినే అధికారం కావాలి
సగటు మనిషి బతికేందుకు
స్వాతంత్ర్యం రావాలి
దేశమా నీ స్వేచ్ఛకై సమరం ఇంకా ముగియనే లేదు
అప్పుడే ఈ దినోత్సవాల
డాంభికాలు ఎందుకు

2 comments:

  1. ఆదివాసాలలో రాజకీయం చేరింది. అక్కడ బందూకు సంస్కృతి మారాలి . మనుషులలో మానవత్వం పెరగాలి . జేవ్న విధానం మారాలి .వ్యక్తిత్వం లో మార్పు రావాలి .సర్వేజన సుఖినో భవంతు.

    ReplyDelete