ఛల్కా హై జామ్...
జిందగీకే నామ్...
బహారో ఫూల్ బర్సావో...
మేరా మహబూబ్ ఆయాహయ్... మహమ్మద్ రఫీ తీయని స్వరం నుంచి మంద్రంగా జాలువారుతున్న గీతం..
టీవి తెరపై అరమోడ్పు కన్నులతో మత్తును వెదజల్లుతున్న వైజయంతీమాల ముగ్ధ మనోహర రూపం... మా పెదాలను తాకుతున్న మధువు ను మించిన
మైకం ఆ కన్నులలో నిండి ఉన్న అనుభూతి... అంతలోనే అదే గాత్రం మధురసాలను వీడి విషాదం కురిపించింది...
మనసున్న మనిషి భగ్న హృదయుడే కదా ఖుష్ రహే తూ సదా యే దువా హై మేరీ అంటూ మోసం చేసిన మనసునే
దీవిస్తూ రెండో పెగ్గు అందుకున్నా భారమైన మనసును తేలిక పరుస్తూ... అంతలోనే ఓ బంగరు
రంగుల చిలకా అంటూ బాలు గారి స్వరం వాతావరణంలో గిలిగింతలు నింపింది.. మేము ఊరుకుంటామా
ఓ దమ్ము వెలిగించి శృతి కలిపాం ఎవరేమనుకున్నా చల్తా అనుకుంటూ... మధ్యాహ్నం పన్నెండు
గంటలకు మొదలైన మా మహేఫిల్ సాయంత్రం దాకా సాగింది....మా Anil Kumar వివాహమై ఇరవై ఐదు
వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక అపురూప సన్నివేశానికి ప్రాణం పోసాం.. మధ్య మధ్యలో
రాజకీయాలు, చిన్న నాటి కహానీలు, యవ్వన ఫాంటసీలు ఒకటేమిటి మొత్తం జీవితం కనులముందు కదలాడింది
మా కబుర్లలో.. అంతలోనే మా పోలీస్ ఫ్రెండ్ నవీన్ కుమార్ గుర్తుకు వచ్చాడు. ఫోన్ చేయగానే
వచ్చి వాలాడు తన బిజీ షెడ్యూల్ ఉన్నా... పనిలో పని యాపిల్ ఫ్లేవర్ హుక్కా కూడా లాగించా...
ఒక ఆత్మీయ ఘట్టానికి ప్రాణం పోసిన అనిల్ కి థాంక్యూ తో బన్తా హై.. షుక్రియా దోస్త్
జీవితాన్ని మరో మారు పరిచయం చేసినందుకు 🙏
No comments:
Post a Comment