సైకత శిల్పాన్ని కాదు
ఓ పిచ్చి కెరటమా
అలవోకగా నన్ను అల్లుకుని
ముంచిపోదామని అనుకున్నావేమో...
మునిగేందుకు శిలజాన్ని
కాదు
కరిగేందుకు సైకత శిల్పాన్ని
కాదు
ఆ సముద్రమంత లోతును మనసులో
నింపుకున్న నేను
అవసరమైతే ఒక సునామినే...
నా ఒక్క అడుగు చాలదా నిన్ను
నా పాదాక్రాంతం చేసేందుకు...
No comments:
Post a Comment