అంకురం
వీలు కుదిరితే
వెనకకు పయనించాలని ఉంది...
కాలమనే కోటను చేధించి నా
గతాన్ని తస్కరించాలని ఉంది
కనురెప్పల నుంచి జారిపడిన
స్వప్నాలను
మళ్ళీ మనసునిండా దాచుకోవాలని
ఉంది...
కాల గ్రంధంలో ఒక్కో పుటను
తనిఖీ చేసి
మధురజ్ఞాపకాలను
సంగ్రహించాలని ఉంది...
వీలు కుదిరితే కాలాన్ని
నిలిపేసి
నవజీవన అంకురానికి ప్రాణం
పోయాలని ఉంది...
No comments:
Post a Comment