జర్నలిజమా
మరణశాసనమా
నీకేందయ్యా జర్నలిస్టువి
నువ్వు కుక్కను కొట్టినా
పైసలు రాలతాయని అంటారు
ఏ కుక్కను కొడితే పైసలు
రాలతాయో అర్ధం కాక
దిక్కులు చూస్తున్నాడు
జర్నలిస్టు...
నువ్వో గొప్ప జర్నలిస్టువి
నీకేంటి ఒక్క ఫోన్ కాల్
చేస్తే లక్ష రూపాయలు వచ్చిపడతాయి అంటాడొకడు
ఎవరికీ ఫోన్ చేస్తే పైసలు
వస్తాయో ఎవడూ చెప్పడు..
అవును జర్నలిస్టు రుబాబుగా
బతుకుతాడు
దర్జాగా తిరుగుతాడు
జేబులో చిల్లిగవ్వ లేకున్నా
విలాసంగా నవ్వుతాడు...
అందరూ సలాం చేసేవారే
కనిపిస్తే అన్నా చాయ్ తాగుతావా
అని ఆప్యాయంగా
అడిగేవారే కానీ
అతను తిన్నాడో లేదో
అడిగేవాడు కనిపించడు...
యాజామాన్యాలు జీతాలు ఇవ్వవు
కొందరికైతే ఉద్యోగాలే ఉండవు
ఎవరికీ ఇది పట్టదు
రిపోర్టర్ కదా అతనికేంటి
అనుకుంటారు...
పాపం ఆ జర్నలిస్టు చేయి
చాచలేడు
చేయి చాచినా ఎవడూ నమ్మడు..
దోపిడే ఉద్యోగంగా బతికే
ఎర్నలిస్టులు ఉన్నారేమో
కాదని అనలేను
బతకలేక చావలేక నరకం అనుభవించే జర్నలిస్టులే
చాలా మంది...
జర్నలిజమా
ఇది మరణశాసనమా...
నిజమా ఇది జర్నలిజమా
ReplyDeleteనీకు నువ్వే ఒక ఇజమా
జేబు ఖాళీ పైకి హీరోయిజమా
నిజమా ఇది జర్నలిజమా
బతుకంతా చాకిరీ సున్నా జమా
ఇది సింగిడియా లేక ప్రిజమా
నిజమా ఇది జర్నలిజమా
ధన్యవాదములు సర్ బాగా చెప్పారు.
Delete