గూడు చెదిరిన పక్షులు
కలిసిరాని ఘడియలు
మరఫిరంగులై దాడులు చేస్తుంటే
అందంగా అల్లుకున్న నా భావ
సౌధం కుప్పకూలిపోతోంది...
ఒక భావానికి మరో భావం
జతచేసి నిర్మించుకున్న
నా ఆశల గూడు పునాదులు
ఒక్కొక్కటిగా జారిపోతున్నాయి...
దిక్కులేని నా భావాలు
ఒక్కొక్కటిగా ఎగిరిపోతున్నాయి
గూడు చెదిరిన పక్షుల్లా...
No comments:
Post a Comment