పులకింతలు
నీలి నింగి కరిమబ్బు దుప్పటి
కప్పుకుని తన నీటి ముత్యాలను నేలపై విసురుతూ కవ్విస్తోంది
అవును సన్నని వాన నేలను
ముద్దాడుతోంది
లయబద్దంగా పుడమిని తాకుతున్న
వాన నీటి సవ్వడిలో నాకు నీ నవ్వే వినిపిస్తోంది
ఈ వానలో నువ్వు నాతో ఉంటే
తడిసిన
మామిడాకులపై జారుతున్న
నీటి ముత్యాలను చూస్తూ ఎన్నెన్ని భావాలను అల్లుకునేవాళ్ళం...
వానలో తడుస్తా అని అల్లరి
చేసే నువ్వు వద్దని వారించే నేనూ
చల్లని వానలోనూ
ఎంత వెచ్చగా ఉంటాయి ఆ పరిసరాలు..
అదేంటోగానీ
ప్రకృతి పులకింతలోనూ
నాకు నీ తుళ్లింతలే కనిపిస్తాయి
మనస్వినీ..
No comments:
Post a Comment