హెచ్చరిక : ఈ పోస్ట్ కొందరి ఆరోగ్యానికి హాని కలిగించగలదు. పూర్తి మానసిక
పరిపక్వతతో రాయడమైనది. అపరిపక్వ మానసులు ఇది చదవరాదు, చదివినా అనుసరించరాదు ఆరోగ్యానికి
హానికరం. కేవలం నా అభిప్రాయంగానే పరిగణించగలరు.
సూసైడ్ వారియర్స్...
అవును వ్యక్తిగత సమస్యలతో
ఆత్మహత్య చేసుకునేవారిని యోధులుగానే పరిగణిస్తాను
నేను. దీనికి నాదగ్గర హేతుబద్ధమైన కారణాలే ఉన్నాయి.. సాధారణంగా మన చుట్టుపక్కల ఆత్మ
హత్యలు చేసుకునే వారిని చూస్తూ ఉంటాం. మీడియాలోనూ ఇలాంటి వార్తలు రోజూ కనిపిస్తూనే
ఉంటాయి. అనవసరంగా చచ్చాడు పిరికోడు బతకాలనే గుండె ధైర్యం లేనోడు అని కామెంట్లు పడేస్తాం.
కనీసం సమస్య ఏంటో ఎవరికైనా చెప్పుకోవాలిగా ఇలా చావడమేంటి... కనీసం మాకన్నా చెప్పుకోవాల్సింది
ఏదో ఒక మార్గం చూపేవాళ్ళం కదా.. ఇలా సన్నాయి నొక్కులు చాలానే వింటాం.. మొత్తంమీద సూసైడ్
చేసుకున్న సదరు శాల్తీని పిరికివాడనో పిరికిదనో జెండర్ ను బట్టి సర్టిఫికెట్ ఇచ్చేస్తాం..
సమాజంలో ఉన్నాం కదా ఇలా సర్టిఫై చేయడం బాధ్యత అని బిల్డప్ ఇచ్చుకుంటాం.మరోవైపు మనం
నెత్తిన మోస్తున్న ఘనమైన మతాలు కూడా ఆత్మ హత్యను మహా పాపంగా పరిగణిస్తున్నాయి. ఇంకోవైపు
ఇండియన్ పీనల్ కోడ్ కూడా ఆత్మహత్యను నేరంగానే చెబుతోంది.
నేనైతే ఏకీభవించను ఈ వాదనతో.
ఒక్కసారి ఆత్మహత్యకు పాల్పడిన
వారి కోణంలో ఆలోచించండి వారెంతటి ధైర్యవంతులో తెలుస్తుంది. ఎవరికైనా బతకాలనే ఉంటుంది,
తనవారితో ఆనందంగా గడపాలనే ఉంటుంది. అయినా చస్తున్నారంటే వారెంత మానసిక క్షోభకు గురై
ఉంటారో ఆలోచించండి. కొంతమంది ప్రేమ విఫలమై కొందరు అయినవాళ్లతో మోసానికి గురై ఆత్మ హత్య
చేసుకుంటున్నా చాలామంది బలవన్మరణాలకు కారణం ఆర్ధిక ఇబ్బందులే.. గుప్పెడంతమంది తప్ప
ఈ లోకంలో ఆర్ధిక సమస్యలున్నవారే అందరూ కాదని అనను. కానీ కొంతమందికి ఈ సమస్య గుదిబండగా
మారుతుంది. ఎలాగైనా బతకాలి అన్న తపనతో అప్పులు చేస్తారు. అయినా సమస్య తీరదు. అప్పులు
తీర్చే మార్గం కనిపించదు, ప్రేమతో పలకరించే వారు మొహం చాటేస్తారు. రక్తసంబంధీకులు పట్టించుకోరు.
ఇంట్లో ఆకలి మంటలు.. ఏం చేయాలో అర్ధం కాదు. ఇలాంటి స్థితిలోనే మనిషి ధైర్యంగా ఆలోచిస్తాడు.
తను పోతే అన్న ఆలోచన ఆ ధైర్యంతోనే పుడుతుంది. తను చస్తే తనవాళ్లు ఏమిటనే ఆలోచన కూడా
వస్తుంది. తనుండి తనవారికి నరకం చూపడం కంటే చచ్చి బాగుపర్చాలని ఆశిస్తాడు, అలా జరుగుతుంది
కూడా. అప్పటిదాకా పట్టించుకోని బంధువులు తను చావగానే పరిగెత్తుకుని వస్తారు. ఎక్కడలేని
సానుభూతి చూపుతూ ఆ కుటుంబానికి పదో పరకో సహాయం చేస్తారు మంచివాళ్లనే క్రెడిట్ దక్కించుకోవాలిగా.
ఇక ఆ ఫ్యామిలీ.. అది భార్య అయిన మొగుడైనా పిల్లలైనా నాలుగు రోజులు ఏడుస్తారు, తర్వాత
మళ్ళీ జీవనపోరాటం చేస్తారు. అప్పటికంటే కొంత బెటర్ గానే.. కొంతమంది విషయంలో ఇది రివర్స్
కూడా అవ్వొచ్చు కానీ చాలా తక్కువ. ఆత్మ హత్య చేసుకునేవాడు ఇదంతా ఆలోచించి ఒక మొండి
ధైర్యానికి వస్తాడు. అప్పుడే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు.కనీసం తనవాళ్లు సుఖంగా
ఉండాలనే తపనే అలా చేయిస్తుంది. ఏమార్గం లేక ఎలాంటి ఆప్షన్ లేక ఆత్మ హత్య చేసుకుంటాడు.
ఎందుకంటే ఈ సమాజం అతనికి ఏ అవకాశమూ ఇవ్వలేదు కనుక. ఇక మహాపాతకమంటూ ఘోషిస్తున్న మతాలు
ఇక్కడ ఏదైనా ఆప్షన్ ఇస్తున్నాయా లేదే.. మహా భక్తులు హుండీల్లో కోట్లు కుమ్మరిస్తారే
గాని పక్కవాడు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోరు. తాను ఆకలితో చస్తూ తనవారికి నరకం
చూపిస్తూ మతం చెప్పింది కనుక చావకుండా ఉండాలా.. ఏదీ ఆ మతం పైసా విదల్చదే.. ఆత్మ హత్య
కు ప్రయత్నించి విఫలమైతే బొక్కలోకి తోస్తుంది ఈ చట్టం, కానీ బతికేందుకు మాత్రం దారి
చూపదు. ఎవడు కోరుకుంటాడు చావాలని సమాజమే అలా తయారు చేస్తోంది. అందుకే ధైర్యం చేసి చస్తున్నారు
చాలామంది. సమస్యలున్నవారందరూ చావాలా అని అడగొచ్చు. చావొద్దు కానీ చచ్చేలా చేస్తున్నారు.
అందుకే చస్తున్నారు. కడుపునిండా తిని సొల్లు కబుర్లు చెప్పే వారు తమ ఆత్మీయులు చావుకు
దగ్గరలో ఉన్నారని తెలిసినా పట్టించుకోరు. రూపాయి పెడితే నాకేం లాభం అని ఆలోచిస్తారు.
ఈ క్విడ్ ప్రోకో గేమ్ లో గెలిచినవారు లైఫ్ ఎంజాయ్ చేస్తారు, ఓడినవారు ధైర్యం చేసి గెలుస్తారు.
అందుకే అంటాను వీలయితే చావకుండా ఆపండి.. ఆ జీవితానికి చేయూతనివ్వండి స్వలాభాపేక్ష లేకుండా..
అంతేగాని పిరికివాడు చచ్చాడు అంటూ సొల్లు కబుర్లు చెప్పకండి
ఆత్మహత్య చేసుకున్నవాడు
పిరికివాడు కాదు.. వాడే అసలైన ధైర్యవంతుడు..ఈ పోస్టు చూసి మీరు రకరకాలుగా స్పందిస్తారని
నాకు తెలుసు. నా ఆలోచనలు అర్ధం కావాలంటే నా లెవెల్ కు ఎదిగి ఆలోచించండి. పోనీ మీలో
ధైర్యం ఉందా ఏదైనా జీవితాన్ని నిలబెట్టేంత?
చితికిపోయిన లక్షల కుటుంబాలున్నాయి. ఒక్కరికీ చేయూతనిచ్చి మీరూ ధైర్యవంతులుకండి.
అంత లేదని నాకు తెలుసు మీకూ తెలుసు.. ఎందుకంటే ఇక్కడ ఎవరి లెక్కలు వారికున్నాయి..
గమనిక : కొందరు మంచివాళ్ళున్నారు
వారికి నా పాదాభివందనాలు. తాము జీవిస్తూ పక్కవాడి జీవితానికి చేయూతనిచ్చే దేవుళ్ళు
ఉన్నారు. వాళ్ళే అసలైన దేవుళ్ళు. కానీ వీరి సంఖ్య చాలా స్వల్పం..
No comments:
Post a Comment