గుణపాఠాలు నేర్పిన
గురువుకి వందనాలు.
తప్పటడుగులు దాటి
తప్పుటడుగులు నేర్పి...
వైభవాలను చిదిమేసి
పరాభవాలను అందించి...
స్నేహపుష్పాలు పూయించి
వెన్నుపోటు రుచి చూపించి...
అభిమానాలు కలబోసి
అవమానాలు అందించి...
మసిపూసి మారేడుకాయ చేసి
వ్యక్తిత్వాన్ని ఏమార్చి...
కలిమిని కరిగించి
లేమిని అంటించి...
అడుగడుగునా నన్ను శాసించిన
ఈ జీవితమే
నాకు మొదటి గురువు...
పాఠాలు నేర్పిన పెద్దలకు
కాదు
గుణపాఠాలు నేర్పిన
ఈ జీవితానికి గురుపూజోత్సవ
వందనాలు...
జీవితానికి గురుపూజోత్సవ వందనాలు 👍
ReplyDeleteఅంతే కదండీ 🙏
Delete