మేడిపండ్లు
శ్వాస ఆడుతున్నదంటే
జీవించి ఉన్నట్టు కాదు
మృతకళేబరాలే సంచరిస్తున్నాయిక్కడ...
పెదాలు పువ్వుల్లా విరబూసాయంటే
చిరునవ్వులు పూసాయని కాదు విరిసే పెదాల మాటున వేదనలెన్నో దాగున్నాయిక్కడ...
మూడు పూటలా తింటున్నాడంటే
ఆకలి తీరిందని కాదు ఆ అన్నం ముద్దలకు ముందే అవమానాలెన్నో దిగమింగుతున్నారిక్కడ...
బంధువులు ఎందరో ఉన్నారంటే
అనుబంధాలు ఉన్నట్టు కాదు బంధాలను బంధనాలుగా చూసే వారిదే రాజ్యమిక్కడ...
తీయని పలుకుల మాటలు కోయిలగానం కాదు మాటల మతలబు చేసే రాబందులున్నాయిక్కడ...
జీవితమంటే అందమైన పూదోట
కాదు విప్పిచూడని మేడిపండ్లు ఎన్నెన్నో రాలిపోతూనే ఉన్నాయిక్కడ...
No comments:
Post a Comment