చెడ్డీ బనీయను
ఫేస్ బుక్ లో AG Datta
గారి చెడ్డి బనియను స్టోరీ పోస్టు చదివాక రాయాలనిపించింది... ఆయన చిన్నప్పుడు ఇంటి
పరిసరాల్లో ఉన్నప్పుడు చెడ్డి బనియన్ మాత్రమే వేసుకునే వారు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళేటప్పుడు
మాత్రమే ప్యాంటూ షర్టూ వేసుకునేవారట... నేను కూడా అంతే ఏడవతరగతి వరకు కూడా చెడ్డి బనియన్
మీదే ఊరంతా తిరిగేవాడిని. స్కూల్ కి కూడా అలానే వెళ్ళేవాడిని, కాకపోతే ఒక షర్ట్ వేసుకునేవాడిని
స్కూల్ లో ఉన్నంత సేపు..గవర్నమెంటు స్కూల్ కదా డ్రెస్సింగ్ గురించి పట్టించుకునేవారు
కాదు. ఊర్లో చెడ్డి మీద తిరుగుతున్నప్పుడు చాలామంది ఆటపట్టించేవారు. పొడుగ్గా ఉండటం
వల్ల చెడ్డి మీద అసహ్యంగా ఉండేదని నాకూ తెలుసు. అయినా అంతే...చెడ్డి బనియనే మన వస్త్రాలంకరణ..
పదో తరగతిలో స్కూల్ కు వెళ్ళినప్పుడు మాత్రం ప్యాంటూ షర్టూ వేసుకునేవాడిని.. ఇంటికొస్తే
మళ్ళీ అదే అవతారం.. ఊర్లో కొందరు తిట్టే దాకా వెళ్ళింది పరిస్థితి ప్యాంటు వేసుకోవచ్చు
కదరా అని... అయినా చాలా కాలం అలాగే కొనసాగించాను.. అలాగని చెడ్డి మీద తిరగటం నాకు షోకు
కాదు.. అసలు నా దగ్గర అవి తప్ప వేరే బట్టలు ఉండేవి కాదు.. మనం గోల్డెన్ స్పూన్ నోట్లో
పెట్టుకుని పుట్టలేదు కదా.. చిన్నప్పుడే నాన్న పోవడం, ఆయన వ్యాపార సహచరులు హ్యాండ్
ఇవ్వటం వంటి కారణాలతో భరించరాని పేదరికం అనుభవించాం.. ఆ చెడ్డి బనియను కూడా అమ్మ కుట్టినవే..
ఒకటే జత ప్యాంటు, షర్టు ఉండేవి. పండగరోజో, ఎవరైనా పెళ్ళికి పిలిస్తేనో వేసుకోవచ్చని
భద్రంగా దాచుకునే వాడిని.. కానీ చెడ్డి మీద తిరిగినన్ని రోజులు నేనెంత వేదన అనుభవించానో
నాకే తెలుసు. ఎందుకంటే పొడుగ్గా,బక్కగా ఉండటం కారణంగా నేను అసహ్యంగా కనపడేవాడిని..
ఇప్పుడు దత్తగారి పోస్టు వల్ల నాటి రోజులు గుర్తుకు వచ్చాయి....
బాధ పెట్టిన సంగతులు ఇలా రాసేసుకుని అలా మర్చిపోవాలి. అప్పుడు ఆ జ్ఞాపకాలు అంతగా వేధించవు.
ReplyDelete