ఏమయ్యింది నాకు....
మానస సంద్రంలో
చిన్న కదలిక...
ఎక్కడో....
చిన్న అలజడి...
ఆ చిరు అలజడి...
మెల్ల మెల్లగా...
బిందు బిందువును...
సమీకృతం చేస్తూ..
ఒక ఉప్పెనలా...
ఓ...సుడిగాలిలా...
హోరు గాలిలా..
జోరు వానలా...
ఎదలోతులను ....
చీల్చుతూ...
గుండె కవాటాలను...
బద్దలు చేస్తూ..
హోరెత్తిన ఉప్పెనలా..
ఉబికివచ్చిన వేళ...
అంతటి సునామీ కూడా
వేగరహితమైన వేళ...
కనురెప్పల మాటున ....
ఎదో అలికిడి...
ఎదో వెచ్చదనం...
అవును ..
చెమర్చిన నా కళ్ళలో...
తడి ఆరీ ఆరకముందే..
ఆ కనురెప్పల తెరలపై..
నడియాడే నీ రూపం..
నవ్విస్తూ...
కవ్విస్తూ...
మైమరిపిస్తుంటే..
తన్మయత్వంతో
నర్తించాల్సిన వేళ...
నా కంటినుండి
జాలువారిన
ఆ నీటి చుక్క..
ఎందుకు అన్ని
ప్రశ్నలు వేస్తోంది..
కన్నీటి సుడులనుండి...
ఉబికి వస్తున్న ప్రశ్నలకు...
ఎందుకు సమాధానాలు..
అందటం లేదు నాకు..
నా అంతరంగంలో..
అంతరంగినిలా..
కొలువైననీవు...
నా అంతరంగాన్నే..
సవాలు చేస్తున్నట్టుగా..
మనసునే మనసు
తొలిచేస్తున్నట్లుగా..
ఏమిటీ ప్రశ్నల
సుడిగాలి...
అసలేమయ్యింది నాకు..
నిజంగా నేను నేనేనా..
నేను నిజంగా...
జవాబు లేని ప్రశ్నలా
మిగిలిపోతానా...
అంతే కదా
మనస్వినీ...
మానస సంద్రంలో
చిన్న కదలిక...
ఎక్కడో....
చిన్న అలజడి...
ఆ చిరు అలజడి...
మెల్ల మెల్లగా...
బిందు బిందువును...
సమీకృతం చేస్తూ..
ఓ...సుడిగాలిలా...
హోరు గాలిలా..
జోరు వానలా...
ఎదలోతులను ....
చీల్చుతూ...
గుండె కవాటాలను...
బద్దలు చేస్తూ..
హోరెత్తిన ఉప్పెనలా..
ఉబికివచ్చిన వేళ...
అంతటి సునామీ కూడా
వేగరహితమైన వేళ...
కనురెప్పల మాటున ....
ఎదో అలికిడి...
ఎదో వెచ్చదనం...
అవును ..
చెమర్చిన నా కళ్ళలో...
తడి ఆరీ ఆరకముందే..
ఆ కనురెప్పల తెరలపై..
నడియాడే నీ రూపం..
నవ్విస్తూ...
కవ్విస్తూ...
మైమరిపిస్తుంటే..
తన్మయత్వంతో
నర్తించాల్సిన వేళ...
నా కంటినుండి
జాలువారిన
ఆ నీటి చుక్క..
ఎందుకు అన్ని
ప్రశ్నలు వేస్తోంది..
కన్నీటి సుడులనుండి...
ఉబికి వస్తున్న ప్రశ్నలకు...
ఎందుకు సమాధానాలు..
అందటం లేదు నాకు..
నా అంతరంగంలో..
అంతరంగినిలా..
కొలువైననీవు...
నా అంతరంగాన్నే..
సవాలు చేస్తున్నట్టుగా..
మనసునే మనసు
తొలిచేస్తున్నట్లుగా..
ఏమిటీ ప్రశ్నల
సుడిగాలి...
అసలేమయ్యింది నాకు..
నిజంగా నేను నేనేనా..
నేను నిజంగా...
జవాబు లేని ప్రశ్నలా
మిగిలిపోతానా...
అంతే కదా
మనస్వినీ...