Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 26 October 2014

అంతా నువ్వే....

అంతా నువ్వే....

ఎక్కడో ...దూరతీరాలలో.......
ఎగసి పడుతున్న ....
సముద్రుడి కెరటాల్లో.....
ఒంటిని తడుముతూ ....
నన్ను తాకుతూ....
ఆట పట్టిస్తూ..
పరాచికాలాడుతూ...
ఇలా వచ్చి అలా పారిపోతున్న...
గాలి కెరటాల్లో...
నీలాకాశంపై....
తన ముద్రను వేస్తూ...
దూది పింజాల్లా..
తేలిపోతూ...
కనిపించీ కనిపించని ...
ముగ్ధ మనోహర రూపాల్లో...
నిశీధి రాత్రులను ....
వెక్కిరిస్తూ...
కాంతులీనే...
తారకల్లో....
నిండు వెన్నెల్లో..
దోబూచులాడుతూ...
కవ్వించే..
నిండు జాబిల్లిలో....
ఒక అనుభూతిలా....
ఒక సుందర కావ్యంలా..
చిరునవ్వులు చిందించే..
కావ్య నాయికలా...
నిత్యం అను నిత్యం...
నీ రూపమే..
నా మదిని పులకింపచేస్తోంది...
అంటే 
నువ్వు ప్రకృతి లోని అణువణువులోనూ
ఉన్నావు..
నా మనస్సులో 
ఉన్నట్టుగానే...
అవును కదా..
మనస్వినీ...

No comments:

Post a Comment