Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday, 22 October 2014

వీళ్ళా మనుషులు..?

వీళ్ళా మనుషులు..?

శ్వాసలో..డబ్బు...
మెదడులో డబ్బు...
రక్తంలోని ప్రతి 
బిందువులో డబ్బు...
ఆలోచనలోడబ్బు..
పెళ్లి సంబంధాలు 
కుదుర్చుకోవాలంటే 
వ్యాపారమే.
.ఎవరితో బంధం ఉంటే
ఎంత లాభం.
 ఇదీ వీరి అంతరంగం..
వీళ్ళు...
బంధాల గురించి 
మాట్లడటమా..
.ప్రేమానుబంధాలు
మమతానురాగాలు..
వీళ్ళకేం తెలుసు.
డబ్బు కోసం 
ఏమైనా చేస్తారు..
మంచి చేడు
వీళ్ళకు పట్టదు...
మనీ కుప్పలుగా వస్తుందంటే..
ఎక్కడైనా పడుకుంటారు..
పడుకోబెడతారు..
వీళ్ళా మనుషులు..
వీళ్ళను చూస్తుంటే 
అసహ్యమేస్తోందికదూ....
మనస్వినీ...

No comments:

Post a Comment