Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 15 August 2016

సముద్రమా నీకిది తప్పదు

సముద్రమా నీకిది తప్పదు

అలజడి రేపే సాగర పౌరుషం  
మౌనం దుప్పటిలోకి జారిపోయింది...
ఎగసిపడే కలల కెరటం
తీరానికి ముందే తలవాల్చేసింది...
ఉబికి వస్తున్న సుడులను
సముద్రం తనలోనే మింగుకుంది...
ఏమయ్యింది సముద్రానికి
ఎందుకు నిశ్చలమయ్యింది...
కలలు రేపే కెరటం
ఎందుకు కథగా మిగిలిపోయింది...
ఎగసిపడే కెరటాలు
ఎందుకు జలసమాధి అవుతున్నాయి...
ఎవరికి తెలుసు సముద్రుడి గోస
ఎవరు చదివారు సాగర మనసు భాష...
సముద్రమా తప్పదు నీకిది
అంతా ఆటు పొట్ల ఆట... 

No comments:

Post a Comment