Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 7 August 2016

జారిపోయింది నా చిరునామా

జారిపోయింది నా చిరునామా
గల్లంతయ్యాను నేను ఎక్కడో
కోల్పోయాను నన్ను నేను ఎక్కడో  
నానుంచి నేను విడిపోయాను ఎక్కడో
జారిపోయింది నా చిరునామా ఎక్కడో
ఎక్కడని వెతకను నా విలాసం ఎక్కడో
నింగి తారకలను అడిగాను
చెప్పమని నేనెక్కడో
చందమామను బతిమాలా
తెలపమని నేనెక్కడో
పిల్లగాలులను తడిమి చూసా
ఉన్నానేమో ఎక్కడో
రాలుతున్న కన్నీటిని తరచి చూసా
ఇంకిపోయానేమోనని పుడమిలో ఎక్కడో
కరుగుతున్న స్వప్నాలలో కాగడా పెట్టి చూసా
ఆవిరినయ్యానేమోనని ఎక్కడో
రెక్కలు విప్పిన సంధ్యలో కనులు పెట్టి చూసా
ఒరిగిపోయానేమోనని ఎక్కడో
ప్రభవించిన ఉషస్సును అడిగా
ఉదయిస్తున్నానేమోనని ఎక్కడో
ప్రకృతి సమస్తాన్ని జల్లెడపట్టిచూసా
దాగి ఉన్నానేమోనని ఎక్కడో
విప్పారిన నీ నేత్రాలను చూసా
ఆడుకుంటున్నా నీ వెన్నెలలో
మనస్వినీ 

No comments:

Post a Comment