Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 7 August 2016

చిలిపి సరాగాలు

చిలిపి సరాగాలు
ఎంత అందంగా ఉంటాయి నీ మాటలు
ఎంత మధురంగా ఉంటాయి నీ చేతలు
ఒకసారి కన్నుగీటి కవ్విస్తావు
మరోసారి బుంగ మూతితో పలకరిస్తావు
బుగ్గలనిండా గాలి నింపుకుని
రెండు చేతులతో కొట్టుకుంటావు
ఒక చేతితో కన్నుమూసుకుని
మరో కన్ను తెరిచి
కన్ను గీటినట్లు పోజుకొడతావు
కన్ను గీటడం తెలియక కాదు
బుంగమూతి పెట్టడం రాకా కాదు
కావాలనే చేస్తావు
మనసు నిండా కవ్విస్తావు
చిలిపి పనులతో ఉడికించే యత్నం చేస్తావు
ఎంత బాగా మారుస్తావు మనసుని
ఎంత అద్భుతంగా పక్కదారి పట్టిస్తావు ఆలోచనలని
ఎంత బావుంటుంది ఆ క్షణం
ఎడారిలో ఒయాసిస్సు దొరికినట్లు
ఎండమావుల్లోనూ దప్పిక తీరినట్లు
వాడిన మానులో కొత్త చివురు తొడిగినట్లు
బీటలు వారిన పుడమిలో అంకురం మొలిచినట్లు
ముభావమైన మనసులో
సరికొత్త భావాల తొలకరి కురిసినట్లు
కదలిక కోల్పోయిన మదిలో
ఏవో కదలికలు కదిలినట్లు
నిజమే
నీ చిలిపి సరాగాలు
నాకు ప్రాణవాయువులు
మనస్వినీ 

No comments:

Post a Comment