మరుజన్మంటూ నాకుంటే
చల్లని చిరుగాలి వింజామరలై
తనువును తాకుతూ
మైమరిపిస్తూఉంటే
తరులనూ విరులనూ వీడి
వాయువమ్మ
నన్నే పలకరిస్తూఉంటే
కనులముందు సోయగాలు
చిందిస్తున్న
పూబాలపై తేనీయను
తాగుతున్న
అందమైన సీతాకొకచిలుకను
చూస్తున్నా నేను ...
చిరుగాలి తాకిడికి
ప్రకంపిస్తున్న
నవరంగుల రెక్కల రంగులనుంచి
అక్షరాలను ఏరుకుంటున్నా
నేను...
విచ్చుకున్న సీతాకొక
చిలుక రెక్కల్లో
మకరంద పిపాసి తుమ్మెద
సవ్వడిలో
నింగి కాన్వాసుపై
కదిలే బొమ్మల పక్షులలో
నవ్వుతున్న పువ్వులలో
పులకిస్తున్న
ప్రకృతిలో
పలకరిస్తున్న నా
భావాలను
అక్షరాలుగా దిద్దుకుంటున్నా
నేను...
చేతిలో నా మనసు కాగితం
భావమనే కలంతో అక్షరాలు
రాసుకుంటున్నా నేను...
అలలా వీచిన కొంటెగాలి
తాకిడి
నా కలల కాగితం
జారిపోయింది
నా జీవితమే ఎగిరిపోయిందనే
కలవరంతో
ఆ కాగితం వెంట పరుగులు
తీస్తున్నా నేను...
మనసు పుటలను
ఒడిసిపట్టుకున్నా
మనసును రంగరించి కొత్త
అక్షరాలు రాసుకుంటున్నా...
అదే నేను
అవే భావాలు
ఒంటరినే అయిన నేను
ఎప్పటికీ ఒంటరిని కాను
భావాల రూపంలో
నా కవితల అల్లికలో
అందమైన ఊహల సవ్వడిలో
నా మనసులో
దోబూచులాడుతూనే ఉన్నావు నువ్వు...
మరుజన్మంటూ ఉంటే
నేనూ నా భావాలు
నా ఊహలు
ఇంకేమీ వద్దు
అందమైన ఊహల ఉద్యానవనంలో
నీ భావాలతో బతికేస్తా
మనస్వినీ...
Good Post...
ReplyDeleteClick Here To 10th క్లాస్ ప్రశ్నా పత్రాలు, టీచర్ నోటిపికేషన్స్, మీకు, మీ పిల్లలకు అవసరమైన ప్రతి సామాచారం ఇక్కడ లభిస్తుంది.