పెళ్లిరోజు
నువ్వూ నేనూ కలిసి అడుగులు వేసిన
మధురమైన రోజిది
నీతో తొలి అడుగులు
నడిచిన
అమృత ఘడియలివి
నీతో నా ప్రయాణం రోజూ
ఒక కొత్త అనుభవమే
కలిసి సాగుతున్న ఈ
కాలంలో
పున్నమి వెన్నెలలు
ఉన్నాయి
అమావాస్య రాత్రులూ
ఉన్నాయి
కటిక చీకటిలో
ఆగిపోలేదు మన పయనం
వెన్నెల వెలుగులను
మనసు నిండా దాచుకుని
సాగింది గమనం
ముభావమైన నువ్వు
ముడుచుకుపోయినా
మరు నిమిషమే పులకింతలు
రేపావు
అడుగు జారితే చేయూతను
ఇచ్చావు
ఆ దేవుడిని నేనెప్పుడూ
వరాలు అడగలేదు
ఊహా సుందరి నిజమై
వస్తుందనీ అనుకోలేదు
ఊహించని వరమై నాలోకి
వచ్చావు
జీవనసంధ్యలో వెన్నెలవై
నిలిచావు
నువ్వు నాలోకి
నేను నీలోకి చేరిన
పరిణయ దినోత్సవాన
కానుకలు ఏమివ్వగలను
భావాలను ఏ రీతిన
తెలుపగలను
మనసును నీ పాదాలకు
సమర్పించి
పెళ్లిరోజు
శుభాకాంక్షలు మాత్రమేచెప్పగలను
మనస్వినీ
No comments:
Post a Comment